ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ సిటీ, వెలుగు :  వరంగల్ లోని కాళోజీ​హెల్త్​యూనివర్సిటీలో శనివారం యూత్​ఫెస్టివల్​ఘనంగా జరిగింది.  కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్​లో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, పాటలు, జానపద నృత్యాలు అలరించాయి. యూనివర్సిటీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, ఆయుష్, పారామెడికల్, డెంటల్ కాలేజీలో ఎన్ఎస్ఎస్​ స్టూడెంట్స్​కు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు చీఫ్​గెస్ట్​గా కాకతీయ మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్  డాక్టర్ డి.మోహన్ దాస్,  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు దేవుడ్​,  ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాలేజీల నుంచి వచ్చిన దాదాపు 1200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్​ ఈ ఫెస్టివల్​లో పాల్గొన్నారు.  వాలంటీర్ల కల్చరల్​ ప్రోగ్రామ్స్​ ఆకట్టుకున్నాయి. కల్చరల్ ప్రోగ్రాంలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, పాల్గొన్న వారికి అభినందన పత్రాలు అందచేశారు. 

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
హనుమకొండ సిటీ, వెలుగు :
తెలంగాణ స్టేట్ లెవల్ అండర్ –15, మాస్టర్స్ 65 ఏళ్లు,70 ఏళ్లు,75 ఏళ్లు బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ముగిశాయి. సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్ లో పోటీల ముగింపు కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్​జోషి హాజరయ్యారు.ఈ పోటీల్లో విజేతలకు సీపీ  షీల్డులను అందజేశారు. కార్యక్రమంలో  విజిలెన్స్ ఎన్​ఫోర్స్ మెంట్ అడిషనల్ ఎస్పీ శోభన్ కుమార్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు ఎం.జితేందర్ రెడ్డి, కైలాస్ యాదవ్, వైకుంఠం, వెంకన్న,టి.రాజేష్, రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.

హసన్ పర్తి, వెలుగు : నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం కలిగించేలా పోలీస్ అఫీసర్లు డ్యూటీ చేయాలని వరంగల్ సీపీ తరుణ్ జోషి అన్నారు. శనివారం పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో కీలక నేరాల్లో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన వరంగల్ కోర్టు అడిషినల్ పీపీ ఎం.సత్యనారయణ, జనగాం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.భిక్షపతి, మామూనూర్ ఏసీసీ ఎ.నరేశ్ కుమార్, పరకాల ఏసీపీ జె.శివరామయ్య, ఇన్​స్పెక్టర్లు డి.విశ్వేశ్వర్, శ్రీనివాస్ తో పాటు కోర్టు కానిస్టేబుళ్లు పి.మోహన్, ఎం.చంద్రయ్య, ఎస్.తిరుపతి, కె.భానుచందర్లను సీపీ సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఈస్ట్, వెస్ట్ జోన్ల డీసీపీలు వెంకటలక్ష్మీ, సీతారాం, సీసీఆర్ బీ ఇన్ స్పెక్టర్లు కరుణాకర్, రమేశ్​పాల్గొన్నారు.

మనబడి  పనులు స్పీడప్​ చేయాలి 
స్టేషన్​ఘన్​పూర్, వెలుగు :
‘మన ఊరు-–-మన బడి’  కింద చేపట్టిన స్కూల్స్​ డెవలప్​మెంట్​పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ శివలింగయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం చాగల్లు ప్రైమరీ స్కూల్​ను శనివారం కలెక్టర్​ తనిఖీ చేశారు. వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు వెంట రాగా స్కూల్​లోని క్లాస్​ రూంలు, వరండా, కిచెన్​ రూంలను పరిశీలించారు. అక్కడకక్కడ గోడలకు వేసిన పెయింటింగ్​లోపాలపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–-మన బడి’ ప్రోగ్రాం కింద జిల్లాలో మొదటి విడత 176 స్కూల్స్​ను ఎంపికచేసి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ అబ్దుల్​ హమీద్​, ఆర్డీవో కృష్ణవేణి, డీఈవో రాము, తహసీల్దార్​ పూల్​సింగ్​ చౌహన్​, ఎడ్యుకేషనల్​ సెక్టోరియల్​ ఆఫీసర్​ గౌసియాబేగం పాల్గొన్నారు. 

డబ్బులు ఇవ్వట్లేదని చిట్​ఫండ్​కు తాళం
వరంగల్, వెలుగు :
చిట్​అయిపోయి రెండేండ్లయినా బిడ్​అమౌంట్​ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న భవిత చిట్​ఫండ్​కు బాధితులు ఆందోళన చేశారు. శనివారం హనుమకొండలోని చిట్​ఫండ్​ మెయిన్​ బ్రాంచీ ఆఫీసుకు తాళం వేశారు. బాధితుల వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన బెల్లంకొండ శ్యాంసుందర్​రెడ్డి పరకాలలోని భవితశ్రీ చిట్​ఫండ్​లో రూ.25 లక్షల చిట్​వేశారు. చిట్​టైం అయిపోయి రెండేండ్లయినా డబ్బులు ఇవ్వకుండా మేనేజ్​మెంట్​తిప్పుకుంటారు. దీంతో విసుగుచెందిన బాధితులు గేటుకు తాళం వేశారు. దీంతో మేనేజ్​మెంట్​డయల్​100కు ఫోన్​చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇష్యూ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు తాళం తీశారు. 

ఎమ్మెల్యే నరేందర్ క్షమాపణ చెప్పాలి 
వరంగల్ సిటీ , శాయంపేట, వెలుగు :
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పద్మశాలీలకు క్షమాపణ చెప్పాలని వరంగల్ పద్మశాలీ సంఘం డిమాండ్  చేసింది. మునుగోడు బైఎలక్షన్​ ప్రచారంలో భాగంగా పద్మశాలీలు దైవంగా భావించే మగ్గంపై కాలుతో తొక్కిన ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ శనివారం కాశీబుగ్గ అంబేద్కర్ కూడలిలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.  శాయంపేటలో పద్మశాలీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాసాని చంద్రప్రకాశ్​ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన చేపట్టారు. చేనేత సొసైటీ నుంచి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి బస్టాండ్ కూడలిలో దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రవి, సొసైటీ చైర్మన్ శంకర్ లింగం, మాజీ చైర్మన్ రమేశ్, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, సమ్మయ్య, ప్రభాకర్, సాంబయ్య, ఆనందం, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

చేప పిల్లల పంపిణీ దేశంలో ఎక్కడా లేదు

పరకాల, వెలుగు : ఉచిత చేపపిల్లల పంపిణీ దేశంలో ఏ రాష్ట్రంలో లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని పెద్ద చెరువులో సుమారు 3లక్షల 50 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపల ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేస్తోందన్నారు.

అనారోగ్యంతో రిపోర్టర్​ మృతి
నర్సంపేట, వెలుగు :
నర్సంపేటలో సీనియర్​ రిపోర్టర్​ మురళి(48) అనారోగ్యంతో శనివారం చనిపోయారు. 20 ఏండ్లుగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో పనిచేసిన మురళి కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి మురళి మృతికి నివాళులర్పించారు.  అంత్యక్రియల కోసం రూ.50వేల నగదును ఇచ్చారు. 

గ్యాస్​ సిలిండర్​ పేలి ఇల్లు దగ్ధం 
నల్లబెల్లి వెలుగు :
గ్యాస్​ సిలిడర్​ పేలి పూరిల్లు దగ్ధమైంది. బాధితుల వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన ఆకారపు సమ్మక్క  పూరిగుడిసెలో శనివారం ఉదయం గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయి. దీంతో పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదంలో రూ.20వేలు నగదు,  బంగారం, వెండి మంటల్లో కాలి బుడిదయ్యాయని బాధితురాలు విలపించింది.

వన్​ టైం స్కీం సద్వినియోగం చేసుకోండి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : గ్రేటర్​ పరిధిలోని ప్రజలు వన్​ టైం స్కీంను సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య అన్నారు. శనివారం బల్దియా హెడ్డాఫీస్​లో కమిషనర్​మాట్లాడుతూ ఓటీఎస్​ స్కీంలో భాగంగా పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ పొందడానికి ఈ నెల 31 చివరి వరకు అవకాశం ఉందన్నారు. తక్కువ టైం ఉండటం వల్ల ఆదివారం కూడా ఈ సేవా, మీ సేవా సెంటర్లు తెరిచే ఉంటాయని, ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 

కాంగ్రెస్​ నాయకుడు జంగాకు పెనాల్టీ
పర్మిషన్​ లేకుండా హనుమకొండ, కాజీపేటల్లో గోడలు, డివైడర్లకు రాహుల్​గాంధీ జోడో యాత్రకు సంబంధించిన వాల్​పోస్టర్​లు అంటించినందుకు కాంగ్రెస్ ​నేత రాఘవరెడ్డికి బల్దియా ఆఫీసర్లు రూ.10వేల పెనాల్టీ విధించారు.

ఏకశిలలో ‘కీ హోల్‍’ పద్ధతిలో లిగ్మెంట్స్​ సర్జరీ
హన్మకొండ సిటీ, వెలుగు: హనుమకొండలోని ఏకశిల హస్పిటల్‍లో జిల్లాలో మొదటిసారిగా శనివారం కీ హోల్‍ పద్ధతిలో లిగ్మెంట్​(మోకాలు) సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు మేనేజింగ్‍ డైరెక్టర్‍ డాక్టర్‍ జి.రమేశ్‍ పేర్కొన్నారు. ఓ వ్యక్తికి యాక్సిడెంట్​కాగా 3 రకాలైన ఏసీఎల్‍, పీసీఎల్‍, ఎంసీఎల్‍ లిగ్మెంట్స్​​సర్జరీ అవసరమైనట్లు గుర్తించామన్నారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‍ను ఆర్థోపెడిక్‍ సర్జన్‍ అండ్‍ జాయింట్‍ రిప్లేస్‍మెంట్‍ సర్జన్‍ డాక్టర్‍ కె.రణధీర్‍ కుమార్‍  కీ హోల్‍ పద్ధతిలో ఒకేసారి మూడు లిగ్మెంట్స్​కు విజయవంతంగా సర్జరీ చేశారన్నారు.

తాడిచెర్ల ఓసీని సందర్శించిన సెంట్రల్ టీం
మల్హర్, వెలుగు :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ ను శనివారం సెంట్రల్ కోల్ ఆఫీసర్ సామ్రాట్ దత్త టీం సందర్శించారు. గనిలోని బొగ్గు క్వాలిటీని డిక్లేర్ చేయడానికి శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. ఆఫీసర్ సామ్రాట్ దత్త వెంట టీఎస్ జెన్కో మైన్స్ జనరల్ మేనేజర్ మోహన్ రావు, ఎస్ఈ వసంత రావు, తాడిచెర్ల ఏఎంఆర్ మైనింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, ఏఎంఆర్ సీనియర్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి , జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి, సీపీఆర్వో వెంకట్ ఉన్నారు. 

ఆఫీసర్లపై ములుగు జడ్పీ చైర్మన్​ ఆగ్రహం 
వెంకటాపూర్, ములుగు, వెలుగు :
ములుగు జిల్లా జడ్పీ ఆఫీసులో శనివారం  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్  అధ్యక్షత జిల్లా స్టాండింగ్​కమిటీల సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో కమిటీల చైర్మన్లు , జడ్పీటీసీలు, సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​మాట్లాడుతూ డాక్టర్లు అంకితభావంతో రోగులకు సేవలందించాలని జడ్పీ చైర్మన్​అన్నారు.  అనంతరం ఆయా శాఖలపై జరిగిన చర్చల్లో డీపీవో వెంకయ్య, డీసీవోలపై జడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పంచాయతీ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, విధి నిర్వహణలో రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రైల్వే ఐజీ 
వరంగల్​ సిటీ, వెలుగు :
భద్రకాళి అమ్మవారిని శనివారం సౌత్​ సెంట్రల్​ రైల్వే ఐజీ రాజారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే ఐజీకి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఐజీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం వరంగల్, కాజీపేటలోని రైల్వే స్టేషన్లలో అమ్మవారి ఫొటోలు ఏర్పాటు చేయాలని ఐజీకి వినతిపత్రం అందజేశారు. 

ఘనంగా నాగుల చవితి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగుల చవితిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వరంగల్​వేయిస్తంభాల గుడిలో మహిళలు పూజలు చేశారు.  తొర్రూరు డివిజన్​కేంద్రంలోని పంచముఖ నాగేంద్రస్వామి ఆలయంలో పుట్టలో పాలు పోసి భక్తులు పూజలు చేశారు. 
- వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్, తొర్రూరు