గల్ఫ్లో కరీంనగర్ జిల్లా యువకుడు మృతి

గల్ఫ్లో కరీంనగర్ జిల్లా యువకుడు మృతి

చిగురుమామిడి, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్​కు వెళ్లిన కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన బూడిద కవిత, ఎల్లయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.  పెద్ద కొడుకు చందు(22) ఇంటర్​చదివాడు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక నాలుగు నెలల కింద ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లి ఓ కంపెనీలో హెల్పర్ గా చేరాడు. మంగళవారం చందు కడుపునొప్పితో బాధపడుతుండగా తోటి కార్మికులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఖర్చు భరించే స్తోమత లేక కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి మరో ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్​చేస్తుండగా గుండెపోటుతో అతడు మృతిచెందాడు.

ఏయీయూ తెలుగు హెల్పింగ్​ఆర్గనైజేషన్​కు సమాచారం అందించడంతో  డెడ్ బాడీని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుడికి ఇంకా పెండ్లి కాలేదు. చందు మృతి సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది.