
కోరుట్ల, వెలుగు: దుబాయ్‌లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక భీముని దుబ్బ కాలనీలో ఉంటున్న అంబల్ల ధర్మరాజు, -విజయ దంపతుల కొడుకు పృథ్వీరాజ్(32) మూడేండ్ల కింద దుబాయ్వెళ్లి.. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన గదిలో పృథ్వీరాజ్ఉరేసుకుని చనిపోయినట్టు బంధువుల కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందించారు. యు వకుడి సూసైడ్ కు కారణాలు తెలియరాలేదు.