'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ వచ్చేసింది

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ వచ్చేసింది

సుధీర్ బాబు, కృతిశెట్టి ప్రధాన పాత్రలలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కలిసి సంయక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. యాక్టర్ అవ్వాలనుకునే ఓ డాక్టర్ స్టోరీనే ఈ సినిమా క‌థ అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

అవ‌స‌రాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామ‌కృష్ణ, కళ్యాణి నటరాజన్ కీ రోల్స్ లో న‌టిస్తున్నారు.  వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 16న థియేట‌ర్లలో సంద‌డి చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా,తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.