శ్రద్ధాను చంపినందుకు పశ్చాత్తాపం లేదు : ఆఫ్తాబ్‌

శ్రద్ధాను చంపినందుకు పశ్చాత్తాపం లేదు : ఆఫ్తాబ్‌

ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలా కీలక విషయాలు వెల్లడించాడు.  ఈ పరీక్షలో శ్రద్ధాను హత్య చేసినట్లుగా అంగీకరించిన  ఆఫ్తాబ్‌..ఆమెను చంపినందుకు తనకు  పశ్చాత్తాపం లేదని వెల్లడించినట్టుగా విచారణ బృందం వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అంగీకరించినట్లు చెప్పాయి. పాలిగ్రాఫ్‌ పరీక్షలో ఆఫ్తాబ్‌  ప్రవర్తన చాలా సాధరణంగా ఉన్నట్టుగా వెల్లడించాయి. ఈ టెస్టుకు సంబంధించి తుది నివేదిక ఇంకా రాలేదు. 

రేపు ఆఫ్తాబ్‌ కు నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అతడికి నార్కో టెస్టు జరిపేందుకు ఇప్పటికే కోర్టు పర్మిషన్ తీసుకన్న పోలీసులు.. డిసెంబరు 1, 5 తేదీల్లో టెస్టులు నిర్వహించనున్నారు. ఇక ఈ కేసులో శ్రద్ధా డీఎన్‌ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. నివేదికలు వస్తేనే  కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. 

28 ఏళ్ల ఆఫ్తాబ్‌ .. తన ప్రియురాలైన శ్రద్ధా వాకర్‌ ను హత్య  చేసి 35 ముక్కలుగా చేశాడు. అనంతరం రాత్రి పూట ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరెస్తూ వచ్చాడు. శ్రద్ధా బతికే ఉన్నట్టుగా అందర్ని నమ్మిస్తూ వచ్చాడు. అయితే బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 12న ఆఫ్తాబ్‌ ను ఆరెస్ట్ చేశారు.