నాలుగు ఎయిర్​పోర్టుల్లో ..ఫుల్​బాడీ స్కానర్లు

నాలుగు ఎయిర్​పోర్టుల్లో ..ఫుల్​బాడీ స్కానర్లు
  •     డోర్​ఫ్రేమ్​ డిటెక్టర్ల స్థానంలో ఏర్పాటు
  •      ప్యాసింజర్లను తాకే అవసరం తప్పుతుంది
  •     సగమవనున్న ఫ్రిస్కింగ్​ టైమ్​

న్యూఢిల్లీ : దేశంలోని కోల్​కతా, చెన్నై, పుణె, గోవా ఎయిర్​పోర్టులలో ఫుల్​బాడీ స్కానర్లను ఎయిర్​పోర్ట్​ ఆఫ్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) ఏర్పాటు చేయనుంది. ఎయిర్​పోర్టులలో ఇప్పటిదాకా ఉన్న డోర్​ఫ్రేమ్​ మెటల్​ డిటెక్టర్స్​ ప్లేస్​లో ఫుల్​ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ సెక్యూరిటీ (బీసీఏఎస్​) ఆదేశించింది. దేశంలోని సెన్సిటివ్​, హైపర్​ సెన్సిటివ్​ ఎయిర్​పోర్టులలో ఫుల్​బాడీ స్కానర్ల ఏర్పాటు తప్పనిసరని స్పష్టం చేసింది. మార్చి 2022 నాటికే అన్ని హైపర్​సెన్సిటివ్​, సెన్సిటివ్​ ఎయిర్​పోర్టులలోను ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటు పూర్తి కావాలని బీసీఏఎస్​ ఆదేశించింది. నవంబర్​ 2021 లో ఈ ఆదేశాలను జారీ చేసింది. కానీ, ఫుల్​ బాడీ స్కానర్లను సమకూర్చుకోవడంలో ఏడాదికి పైగా ఆలస్యం జరిగింది. పైన చెప్పిన 4 ఎయిర్​పోర్టులలో  ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటుకు  పబ్లిక్​ ఇన్వెస్ట్​మెంట్​ బోర్డు నుంచి సెప్టెంబర్​ 13 నాడు ఏఏఐ కి అనుమతి వచ్చింది. కోల్​కతా ఎయిర్​పోర్టులో 13, చెన్నై ఎయిర్​పోర్టులో 12, గోవా ఎయిర్​పోర్టులో 8, పుణె ఎయిర్​పోర్టులో 5 ఫుల్​బాడీ స్కానర్లను ఏర్పాటు చేయనున్నారు. 

జులైలోనే టెండర్లు....

131 ఫుల్​ బాడీ స్కానర్ల కొనుగోలుకు ఈ ఏడాది జులై నెలలోనే ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఏఏఐ అధీనంలోని ఎయిర్​పోర్టులలో ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటు కోసమే ఈ టెండర్లను పిలిచారు. వాటి కొనుగోలుకు రూ. 1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పబ్లిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ బోర్డు నుంచి అనుమతి లేకపోవడంతో ఆ టెండర్లను తర్వాత ప్రభుత్వం  విత్​డ్రా చేసుకుంది. 

84 ఎయిర్​పోర్టులలో ఫుల్​బాడీ స్కానర్లు పెట్టాల్సిందే...

దేశంలోని 84 ఎయిర్​పోర్టులలో ఫుల్​ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాల్సిందేనని బీసీఏఎస్​ ఏప్రిల్​ 2019 లో ఆదేశాలు జారీ చేసింది. మార్చి 2020 నాటికల్లా  డోర్​ ఫ్రేమ్​ మెటల్​ డిటెక్టర్ల పేస్​లో ఫుల్​ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మిగిలిన ఎయిర్​పోర్టులలో 2021 నాటికల్లా ఫుల్​ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 198 ఫుల్​ బాడీ స్కానర్ల కొనుగోలుకు ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా టెండర్​ను కూడా జారీ చేసింది. కానీ, కొవిడ్​ ​సహా వివిధ కారణాల వల్ల కొనుగోలు ప్రక్రియ బాగా ఆలస్యమైంది.

ప్యాసింజర్​ ఫ్రిస్కింగ్​ టైము తగ్గుతుంది...

ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ప్యాసింజర్ల ఫ్రిస్కింగ్​కు పట్టే టైము కూడా సగానికి తగ్గుతుంది. సాధారణ ఫ్రిస్కింగ్​కు ఒక్కో ప్యాసింజర్​కు 30 సెకండ్లు అవసరమైతే, ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ఆ టైము 15 సెకండ్లకు తగ్గిపోతుంది. అదనంగా 600 కొత్త హ్యాండ్​ బ్యాగేజ్​ స్కానర్లను కూడా నెలకొల్పుతారు.  

రూ. 1,000 కోట్ల ఖర్చు....

రూ. 1,000 కోట్ల  ఖర్చుతో  43 ఎయిర్​పోర్టులలో  131 ఫుల్​ బాడీ స్కానర్లు, 600 కొత్త హ్యాండ్​ బ్యాగేజ్​ స్కానర్​ మెషిన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ 43 ఎయిర్​పోర్టుల జాబితాలో అమృత్​సర్​, గోవా, శ్రీనగర్​, జమ్ము, లే, వారణాసి, చెన్నై, పుణె, కోల్​కతా, రాయ్​పుర్​, తిరుపతి, భోపాల్​ ఎయిర్​పోర్టులు ఉన్నాయి.

ప్యాసింజర్లను తాకే అవసరం తప్పుతుంది...

ఫుల్​ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ప్యాసింజర్ల శరీరాలను తాకాల్సిన అవసరం తప్పుతుంది. ప్రైమరీ స్క్రీనింగ్​ తర్వాత మెటల్​ డిటెక్టర్​ నుంచి ప్యాసింజర్లు  నడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత  క్లీన్​ ప్యాసింజర్లను ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఇతర ప్యాసింజర్లకు మాత్రమే ఫ్రిస్కింగ్​ అవసరం పడుతుంది. మన దేశంలో వస్త్రధారణ (చీరలు, లుంగీలు, పల్లు) ను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనువైన ఫుల్​బాడీ స్కానర్లకు స్పెసిఫికేషన్స్​ నిర్ణయించారు.