యూపీలో పోటీ చేయబోతున్నాం.. అవకాశమిస్తే ఢిల్లీలా డెవలప్ చేస్తాం

యూపీలో పోటీ చేయబోతున్నాం.. అవకాశమిస్తే ఢిల్లీలా డెవలప్ చేస్తాం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలా యూపీని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్లు ఒక్కసారి అవకాశమిస్తే మిగిలిన పార్టీలను మర్చిపోయేలా అభివృద్ధి చేసి చూపుతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

‘ఉత్తర్ ప్రదేశ్‌‌లోని పలు జిల్లాల ప్రజలు వైద్య సేవలు, కనీస సౌకర్యాలు, విద్య కోసం ఢిల్లీకి రావాల్సిన అవసరం ఏముంది? ఆయా సౌకర్యాలను తమ సొంత రాష్ట్రంలోనే వారికి అందుబాటులో ఉంచాలి. 2022లో జరగబోయే యూపీ ఎన్నకల్లో ఆప్ పోటీ చేస్తుంది. యూపీ రాజకీయాల్లో తీవ్రత లోపించింది. దాన్ని ఆప్ తిరిగి తీసుకురాగలదు. నేను ఓ హామీ ఇవ్వగలను.. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మాకు అవకాశమిస్తే మిగిలిన పార్టీలను మర్చిపోయేలా పాలన చేసి చూపుతాం. నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఏర్పడాలనే ఆకాంక్షతో ఢిల్లీ ప్రజలు మాకు ఓటేశారు. యూపీ ప్రజలు కూడా అలాంటి నిజాయితీ, పారదర్శకత గల సర్కార్ కావాలని కోరుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ చెప్పారు.