
ముంబై: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌లు బిగ్ స్క్రీన్‌పై కలసి సందడి చేయనున్నారని తెలుస్తోంది. షారుఖ్-అమీర్ కలిసి పెహలా నషా సినిమాలో తొలిసారిగా నటించారు. ప్రస్తుతం ఆమిర్ లాల్ సింగ్ చద్దా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. లాల్ సింగ్ చద్దాలో ఒక స్పెషల్ కేమియో రోల్‌లో షారుఖ్ ఖాన్ కనిపించనున్నారని సమాచారం. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాలో ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాను అద్వయిత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ క్రిస్‌మస్‌కు విడుదల కావాల్సిన లాల్ సింగ్ చద్దా.. కరోనా కారణంగా వచ్చే క్రిస్‌మస్‌కు వాయిదా పడింది.