ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది

 ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది

కల్పిత పాత్రలనే అత్యద్భుతంగా పండిస్తాడు ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్. ఇక రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే ప్రాణం పెట్టేస్తాడు.  ‘దంగల్’ సినిమాలోని రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ లాంటి పాత్రలే అందుకు ఉదాహరణ. త్వరలో మరో ఫేమస్ పర్సనాలిటీ పాత్రను పోషించబోతున్నాడు ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. టీ సిరీస్ సంస్థను స్థాపించిన గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ఆయన కొడుకు, నిర్మాత భూషణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ముఘల్’ అనే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తాడని ప్రకటించారు. అనుకోకుండా అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పుకోవడంతో ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఒప్పించాడు భూషణ్. అయితే ‘లాల్ సింగ్ చద్ధా’తో ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ లేటయ్యిందట. అది పూర్తవ్వగానే ఈ మూవీ స్టార్ట్ చేయడానికి తాను రెడీ అని చెప్పాడట. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14న సినిమా రిలీజయ్యాక తమ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని భూషణ్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆడియో రంగంలో సంచలనం సృష్టించిన గుల్షన్..1997లో హత్యకు గురయ్యారు. 2001లో వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి తానే గుల్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చంపినట్టు ఒప్పుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.  ఇన్నాళ్లకి గుల్షన్  జీవితం సినిమాగా రానుండటం, ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది.