సీఎంగాకేజ్రీవాల్ కొనసాగుతారు: ఢిల్లీ మంత్రి అతిషి

సీఎంగాకేజ్రీవాల్ కొనసాగుతారు: ఢిల్లీ మంత్రి అతిషి

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్ అయినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ మంత్రి అతిషీ  అన్నారు. లోక్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం పెద్ద కుట్ర అని అతిథి అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన ఇంటిముందు ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కేజ్రీవాల్ ఇంటితో పాటు , ఈడీ కార్యాలయం వద్ద భారీ మోహరిం చారు పోలీసులు. 

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకుండాఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను  గురువారం(మార్చి 21)  ఢీల్లీ హైకోర్డు విచారించింది. అయితే అరెస్ట్ ను ఆప లేమని కోర్టు ఆర్డర్లు జారీ చేసిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. హైకోర్టు ఆర్డర్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే అరెస్ట్ ను ఆపలేం అని హైకోర్టు స్పష్టం చేసిన కొద్ది వ్యవధిలోనే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.