ఉత్సాహంగా ఆస్మిత ఖేలో టాలెంట్ పోటీలు

 ఉత్సాహంగా  ఆస్మిత ఖేలో టాలెంట్  పోటీలు

కామారెడ్డి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం, క్రీడలు యువజన సర్వీసుల మంత్రిత్వ  శాఖ, స్పోర్ట్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా  ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆస్మిత ఖేలో ఇండియా లీగ్  టాలెంట్​ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. 

వివిధ పోటీల్లో గెలిచిన క్రీడకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో అబ్జర్వర్​ స్వాములు, ఆశ్విని, జిల్లా యూత్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ రంగా వెంకటేశ్వర్​గౌడ్, జిల్లా అథ్లెటిక్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు జైపాల్​రెడ్డి, సెక్రటరీ అనిల్​కుమార్, ఎస్జీఎఫ్​ సెక్రటరీ హీరాలాల్, ప్రతినిధులు నాగరాజు, దత్తాత్రి, నవీన్, శ్రీనివాస్,​ భాస్కర్​రెడ్డి, రేణుక పాల్గొన్నారు.