టీ20ల్లో పాక్ బ్యాట్స్మన్ చెత్త రికార్డు

టీ20ల్లో పాక్ బ్యాట్స్మన్ చెత్త రికార్డు

క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు పాక్ బ్యాట్స్మన్ పేరిట నమోదైంది. పాకిస్థాన్ బ్యాట్స్ మన్ అబ్దుల్లా షఫీఖ్ టీ20ల్లో అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో డకౌటైన తొలి బ్యాటర్ గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అఫ్ఘనిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో టీ20లో అబ్దుల్లా షఫీఖ్ గోల్డెన్ డకౌట్ అయి వరస్ట్ ఫీట్ ను సాధించాడు. 

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టీ20లోనూ అబ్దుల్లా షఫీఖ్ డకౌటయ్యాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో రెండు టీ20ల్లో వరుసగా రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 

ఓటమి..

అప్ఘనిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో పాక్ ఓటమిపాలైంది.  ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్  20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులే చేసింది. ఇమాద్ వసీమ్(57 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో 64 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 44), ఇబ్రహీం జడ్రాన్(40 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించారు.  నజిబుల్లా జడ్రాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23 నాటౌట్) చెలరేగాడు.  మహమ్మద్ నబీ సైతం(9 బంతుల్లో సిక్స్‌తో 14 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.