వాళ్లు క్లోజ్గా ఉండటం చూడలేకే ఆ పని చేశా : నిందితుడు కృష్ణ

వాళ్లు క్లోజ్గా ఉండటం చూడలేకే ఆ పని చేశా : నిందితుడు కృష్ణ

అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నవీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు హరికృష్ణపై సెక్షన్ 302, 201 ఐపీసీ, 5(2) (V) , ఎస్సీ,ఎస్టీ, POA act 2015 సెక్షన్‭ల కింద కేసులు బుక్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ.. తనంతట తానే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడని పోలీసులు చెప్పారు. మృతుడు నవీన్ తో కలిసి తాను దిల్‭సుఖ్ నగర్‭లో ఇంటర్మీడియట్ చదువుకున్నట్లు నిందితుడు కృష్ణ చెప్పాడు. ఆ సమయంలోనే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి దూరమైందని పోలీసులకు వివరించాడు. కొన్నాళ్ల తర్వాత నవీన్ అదే అమ్మాయిని ప్రేమించడంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక నవీన్ హత్యకు 3  నెలల ముందే ప్లాన్ చేసినట్లు కృష్ణ అంగీకరించాడు.

ఫిబ్రవరి 17న ఇద్దరు ఎల్చీ నగర్‭లో కలుసుకున్నారని అక్కడి నుంచి మూసారంబాగ్ లోని కృష్ణ ఇంటికి వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. అదే రోజు రాత్రి నవీన్ ను హాస్టల్ వద్ద దింపేందుకు బైక్ పై తీసుకెళ్లిన కృష్ణ.. కొద్దిదూరం వెళ్లాక ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నీవన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో దాడి చేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. నవీన్ ప్రైవేట్ భాగాలతో పాటు గుండె, తల, చేతి వేళ్లు అన్నింటినీ కత్తితో వేరు చేసి.. అక్కడి నుండి వెళ్లి పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరోవైపు నవీన్ మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తైంది. ముక్కలు ముక్కలుగా ఉన్న కొడుకు డెడ్ బాడీని చూసి నవీన్ తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.