"చాల్లే చాల్లే" పాటను విడుదల చేసిన శివ నిర్వాణ

"చాల్లే చాల్లే" పాటను విడుదల చేసిన శివ నిర్వాణ

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫేమ్ నవిమి గాయక్ జంటగా వస్తున్న చిత్రం “అభిరామ్”. రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ చిత్రంలోని "చాల్లే చాల్లే" లిరికల్ సాంగ్ ను మేకర్స్ వదిలారు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించిన "అభిరామ్" సినిమాలోని "చాల్లే చాల్లే" అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను చూశానని దర్శకుడు శివ నిర్వాణ తెలిపాడు. ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా చాలా క్యాచీగా ఉందన్నాడు. మీనాక్షి భుజంగ్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే ఈ పాటను పాడడం విశేషం అన్నాడు. ఈ పాటలో విజువల్స్ చాలా బాగున్నాయని.. హీరో, హీరోయిన్ లు చాలా బాగా చేశారన్నాడు. కాబట్టి సినిమాలో కూడా బాగా చేసుంటారు అనుకుంటున్నానని తెలిపాడు. చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు పని చేసిన "అభిరామ్" సినిమా టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అలాగే దర్శక, నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని శివ అన్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో యష్ రాజ్, నవిమి గాయక్, శివబాలాజీ, నవీన్ రెడ్డి, బాహుబలి ప్రభాకర్, రఘు బాబు, కాదంబరి కిరణ్, అన్నపూర్ణమ్మ, తులసి,వై విజయ, సుమన్ శెట్టి, విజయ రంగనాథ్,గౌతమ్ రాజు, జబర్దస్త్ శేషు, కిషోర్ దాస్, తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : లెజెండరీ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : జింకా శ్రీనివాసులు
దర్శకత్వం : రామకృష్ణార్జున్,
డి. ఓ. పి: కొమరి జగదీష్,
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్,
సంగీతం మీనాక్షి భుజంగ్ ,
పాటలు : సాగర్ నారాయణ్ ఎం.
స్టంట్స్ : వించన్ అంజి,
డాన్స్ మాస్టర్ : చంద్ర కిరణ్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఉల్లగంటి ప్రసాద్
పి. ఆర్ ఓ : మధు వి. ఆర్