
అల్లా దయ ఉంటే భారత్ నుంచి జమ్మూకశ్మీర్ స్వాతంత్ర్యం పొందుతుందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా. జమ్మూకశ్మీర్ కు స్వంతంత్ర్య ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడంపై స్పందించారు ఫరూఖ్ అబ్దుల్లా. ఆర్టికల్ 370ని ఎలా రద్దు చేస్తారో తానూ చూస్తానని సవాల్ చేశారు. దానిని అడ్డుకుని తీరతామన్నారు.