జాబ్నోటిఫికేషన్స్ఇవ్వకుండా యువతను మోసం చేశారంటూ ఏబీవీపీ, బీజేవైఎం నేతలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేట పర్యటనకు వచ్చిన కేటీఆర్ పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహిస్తుండగా బీజేవైఎం, ఏబీవీపీ నేతలు శ్రీకాంత్రాజ్యన్, దేవేందర్‌నాయక్, చందర్‌నాయక్, మధు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గత హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రజలను మోసగించేందుకు వచ్చారా.. అంటూ కేటీఆర్వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. గత అచ్చంపేట మున్సిపల్ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారంటూ ఈ సందర్భంగా యువకులు నినాదాలు చేశారు. కేటీఆర్ ప్రోగ్రాం ముగిసేవరకు ఏబీవీపీ, బీజేవైఎం నేతలను పోలీస్ స్టేషన్లోనే ఉంచి అనంతరం వదిలిపెట్టారు.
కార్యకర్తల ముందస్తు అరెస్ట్
మంత్రి కేటీఆర్జడ్చర్ల పర్యటన నేపథ్యంలో బుధవారం జడ్చర్ల, మక్తల్, కందనూలులో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జడ్చర్లకు చెందిన బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ అధ్యక్షులు పాలాది రామ్మోహన్ తో పాటు 20 మంది ఏబీవీపీ కార్యకర్తలను పట్టణ శివారులోని పోలీస్ట్రైనింగ్సెంటర్కు తరలించడం పట్ల పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అదేవిధంగా మిడ్జిల్, నవాబుపేట, బాలానగర్, రాజాపూర్మండల కేంద్రాల్లోని బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్మాట్లాడుతూ అరెస్టులతో ఆందోళనలను అడ్డుకోలేరన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చాడన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుంటే బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి హౌస్ అరెస్ట్
ఉప్పునుంతల, వెలుగు: ఉద్యోగాల కోసం అచ్చంపేటలో కేటీఆర్పర్యటనను అడ్డుకుందామని పిలుపునిచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్మాదిగను వంగూరు పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. బుధవారం చారగొండలో 2 గంటలకు అరెస్ట్ చేసి ఉప్పునుంతల మండలంలోని కొరిటికల్‌కు తరలించి గృహనిర్బంధం లో ఉంచారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేవని అన్నారు. జాబ్స్లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినా నిరుద్యోగ యుద్ధం ఆగదని ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగలైనా ఇవ్వండి, లేక కార్పొరేషన్ లోన్స్ అయినా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మే నెల చివరి వారం అచ్చంపేటలో నిరుద్యోగ గర్జన సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
