కలెక్టరేట్ల ఎదుట ఏబీవీపీ ధర్నా

కలెక్టరేట్ల ఎదుట ఏబీవీపీ ధర్నా

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మెదక్​లో ఏబీవీపీ మెదక్ విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ శశికాంత్, సంగారెడ్డి, సిద్దిపేటలో జిల్లా కన్వీనర్లు ఆకాశ్, వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్​ షిప్​ లు ఇవ్వకుండా స్టూడెంట్స్​కు అన్యాయం చేస్తోందన్నారు.  కేసీఆర్​ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థి వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. 

ప్రభుత్వ యూనివర్సిటీలలో 75 శాతం పైగా ఖాళీగా ఉన్న అధ్యాపక, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ పోస్టులను భర్తీ చేసి, వాటికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. మెదక్ పట్టణం నుంచి ఉమెన్స్​ డిగ్రీ కాలేజీని భువనగిరికి తరలించడాన్ని నిలిపివేయాలని, ఉమెన్స్​ జూనియర్​ కాలేజీకి ప్రహరీ నిర్మించి ముంపు నుంచి కాపాడాలని డిమాండ్​ చేశారు.