రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా

రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతలు ర్యాలీగా వచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ముందు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్​తిరుపతి రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కందాడి శ్రీరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్ విడుదల చేయకుండా స్టూడెంట్లకు అన్యాయం చేస్తోందన్నారు. 

ఎంతో మంది పేద, మధ్యతరగతి స్టూడెంట్లు ఫీజు రీయంబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్​పైన ఆధారపడి చదువుతున్నారని, అవి వారికి సకాలంలో రాకపోవడంతో కాలేజీల మేనేజ్​మెంట్లు ఫీజు కట్టిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామంటూ అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పేద స్టూడెంట్లు ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. పెండింగ్​లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సంఘటన మంత్రి విష్ణువర్ధన్, మహేశ్, జాయింట్ సెక్రటరీ సంజీవ రెడ్డి, విభాగ్ కన్వీనర్లు  పాల్గొన్నారు.