
గద్వాల టౌన్, వెలుగు: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేశ్, అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా ఎగ్జామ్స్ రాసినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు.