
మెదక్ టౌన్, వెలుగు : వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ ఖాలి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ర్ట వర్కింగ్ కమిటీ సభ్యుడు శశికాంత్ డిమాండ్ చేశారు. సందేశ్ ఖాలి ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పశ్చిమ బెంగాల్ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి అని అన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా ముఖ్యమంత్రిగా ఉంటూ మమతాబెనర్జీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.వెస్ట్ బెంగాల్ లో అధికార పార్టీ నాయకుడు షాజహాన్ షేక్, అతడి అనుచరులు సందేశ్ ఖాలిలోని గిరిజనులపై దాడులు చేయడం దారుణమన్నారు.