సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ధర్నాకు దిగింది. కూకట్ పల్లిలోని ముంబై ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.సకాలంలో స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని, అసెంబ్లీ సమావేశాలను సైతం అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. ధర్నా చేస్తున్న వారిని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.