ఏసీబీకి చిక్కిన నల్గొండ మత్స్యశాఖ అధికారి

ఏసీబీకి చిక్కిన నల్గొండ మత్స్యశాఖ అధికారి
  •  కొత్త సభ్యులను చేర్చేందుకు 
  • రూ. 70 వేలు డిమాండ్‌‌‌‌
  • రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

నల్గొండ అర్బన్‌‌‌‌, వెలుగు : మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చేందుకు లంచం తీసుకున్న నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కేతేపల్లి మండలానికి చెందిన ఫిషరీస్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ సొసైటీలో 17 మంది కొత్త సభ్యులను చేర్చేందుకు సొసైటీ ప్రతినిధులు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం.చరితారెడ్డిని కలిశారు.

 సభ్యులను చేర్చుకునేందుకు ఆమోదం తెలపాలంటే రూ. 70 ఇవ్వాలని సదరు ఆఫీసర్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేయగా.. రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అనంతరం ఈ విషయంపై ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు గురువారం జిల్లా షిఫరీస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో చరితారెడ్డిని కలిసి రూ. 20 వేలు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆమెను రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. చరితారెడ్డిని అరెస్ట్‌‌‌‌ చేసి హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో నల్గొండలోని మత్స్యశాఖ ఆఫీస్‌‌‌‌తో పాటు హైదరాబాద్‌‌‌‌లోని చరితారెడ్డి ఇంటిలో సోదాలు చేశారు.