చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయండి

చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయండి

చంద్రబాబు కోసం జైళ్లో ఏసీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ జైళ్ల  శాఖను ఏసీబీ కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఉన్న చర్మ సమస్యల కారణంగా ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన ఏసీబీ కోర్టు..రాజమండ్రి జైళ్లోని జైల్ స్నేహ బ్లాక్ లో  చంద్రబాబు ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖను ఆదేశించింది. 

చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన హౌజ్ మోషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా డాక్టర్లు, జైళ్ల శాఖ అధికారులతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. చంద్రబాబుకు చర్మ సమస్యలు ఉన్నాయంటూ డాక్టర్లు జడ్జికి తెలిపారు. దీంతో చంద్రబాబు ఉంటున్న బ్యారక్ లో ఏసీ ఏర్పాటు చేయాలని, వైద్యుల సూచనలు అమలు చేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.  
 

ALSO READ : మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం