- రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు
లక్ష్మణచాంద (మామడ), వెలుగు : కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి లంచం తీసుకున్న ఓ ఎస్సైని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా మామడ ఎస్సైగా పనిచేస్తున్న అశోక్ ఓ చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూ. 40 వేలు డిమాండ్ చేశాడు.
అంత ఇచ్చుకోలేమని బాధితులు చెప్పడంతో చివరకు రూ. 20 వేలకు ఒప్పందం కుదిరింది. ఎస్సై లంచం డిమాండ్ చేసిన విషయాన్ని సదరు వ్యక్తులు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు గురువారం ఎస్సైని కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై అశోక్‌ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
