
మెహిదీపట్నం, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పిందని హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ టి. రాంబాబు తెలిపారు. న్యూ బోయిగూడ కమాన్ కు చెందిన అబ్దుల్ హఫీజ్ (30), 2021లో స్థానికంగా ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టుకు అందజేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు అబ్దుల్ హఫీజ్‌కు జైలు శిక్ష విధిస్తూ.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్టు సీఐ చెప్పారు.