ఎమ్మెల్యేల కేసును సీబీఐకి అప్పగించాలి : తుషార్

ఎమ్మెల్యేల కేసును సీబీఐకి అప్పగించాలి : తుషార్

తెలంగాణ హైకోర్టులో  కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసు దర్యాప్తును  సీబీఐకి అప్పగించాలని ఆయన  పిటిషన్ వేశారు.  సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్ లో సీఎం కేసీఆర్ ను  ప్రతివాదిగా పేర్కొ న్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్ లో  పేర్కొన్నారు. ఈ నెల 21న విచారణకు రావాలని 16న తనకు  41ఏ నోటీసులు ఇచ్చారని తెలిపారు. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు 2 వారాల గడువు కావాలని తుషార్ కోరారు.  తన మెయిల్ కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనని తుషార్ పిటిషన్ లో తెలిపారు. ఈ కేసులో తుషార్ కు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. . 

ఇదే కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖను ఇవాళ సిట్ 8 గంటల పాటు విచారించింది.  ఈ నెల 25న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ బృందం విచారించింది. అనుమానాలు నివృత్తి కాకపోవడంతో ఇవాళ మరోసారి ఆమెను సిట్ విచారించింది. దాదాపు 8 గంటలు చిత్రలేఖను సిట్ విచారించింది. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి చిత్రలేఖ వెళ్లిపోయింది. స్వామీజీతో దిగిన ఫోటోలు, కాల్ డేటా ఆధారంగా చిత్రలేఖను సిట్ పలు ప్రశ్నలు అడిగింది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందుకు ఉన్న సంబంధంపై చిత్రలేఖను ప్రశ్నించిన సిట్.. ఆమె స్టేట్ మెంట్ ను నమోదు చేసుకుంది.