
రాష్ట్రంలో కరెంట్ బిల్లుల అదనపు చార్జీలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ నెల కరెంట్ బిల్లుల్లో అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీలను డిస్కంలు వేశాయి. రెగ్యులర్ బిల్లుకు మూడు నాలుగు రెట్లు ఈ చార్జీలు ఉన్నాయి. అయితే వీటిని వెంటనే రద్దు చేయాలని వివేక్ వెంకటస్వామి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పటికే పెంచిన కరెంటు బిల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ అదనంగా ఏసీడీ పేరుతో వేలల్లో బిల్లు వేసి దోచుకుంటుందని ఆరోపించారు. ఈ ట్విట్కు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.
మరోవైపు ఇష్టమున్నట్లు కరెంటు బిల్లులను పెంచడం, రకరకాల పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేయడంపై జనం మర్లవడ్తున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. బిల్లుల వసూళ్లకు వచ్చే కరెంటోళ్లను నిలదీస్తున్నారు. ఈ నెల కరెంట్బిల్లుల్లో అడిషనల్కన్జంప్షన్ డిపాజిట్(ఏసీడీ) చార్జీలను డిస్కంలు వేశాయి. రెగ్యులర్ బిల్లుకు మూడు నాలుగు రెట్లు ఈ చార్జీలు ఉన్నాయి. దీంతో జనం మండిపడుతున్నారు. ఇప్పటికే రెగ్యులర్ బిల్లులను ఇష్టమున్నట్లు పెంచి.. ఇప్పుడు కొత్తగా డిపాజిట్పేరుతో వేలకు వేలు వసూలు చేయడం ఏందని నిలదీస్తున్నారు. ఒక్క నెల బిల్లు కట్టకున్నా కనెక్షన్ కట్ చేస్తున్నారని, అట్లాంటిది రెండు, మూడు నెలల బిల్లును అడ్వాన్స్‌గా డిపాజిట్చేయాలంటే ఎక్కడినుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఏసీడీ చార్జీలు రద్దు చేసే వరకు కరెంట్ బిల్లులు కట్టే ప్రసక్తి లేదంటూ గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు.