
- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
వంగూరు, వెలుగు: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపూర్ మాచినోనిపల్లి, గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 33 లక్షల కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు.
మాచినోపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిమ్ముల హరీశ్ రెడ్డి, శంకర్ యాదవ్, యాదగిరిరావు, మంద హర్షిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుకాతదితరులు పాల్గొన్నారు.