‘ఆచార్య’ రిలీజ్ డేట్ త్వరలోనే చెప్తాం

V6 Velugu Posted on Jul 11, 2021

‘ఆచార్య’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఓ మంచి కబురు వచ్చింది. చిరంజీవి, రామ్‌‌‌‌చరణ్‌‌‌‌లను కలిపి ఒకేసారి తెరపై చూడాలని ఉవ్విళ్లూరుతున్న మెగా ఫ్యాన్స్ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరిందని, అతి త్వరలో రిలీజ్ డేట్ చెప్తామని ప్రకటించారు. కరోనా వల్ల ఆగిన ఈ మూవీ షూటింగ్‌‌‌‌ను తిరిగి మొదలుపెట్టారు. నిన్నటి నుంచి ఫైనల్ షెడ్యూల్‌‌‌‌ని స్టార్ట్ చేసినట్లు కన్‌‌ఫర్మ్ చేశారు. ‘ధర్మస్థలి డోర్స్ రీ ఓపెన్’ అంటూ  రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను కూడా రిలీజ్ చేశారు. మెడలో కండువా, నుదుటన బొట్టుతో చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తున్నాడు చరణ్. ఈ మూవీలో తను సిద్ధ అనే నక్సలైట్‌‌‌‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తనపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tagged ram charan, acharya, Chiranjeevi, kajal agarwal, Pooja Hegde, , acharya movie release date

Latest Videos

Subscribe Now

More News