రివ్యూ : ఆచార్య

రివ్యూ : ఆచార్య

రివ్యూ : ఆచార్య
రన్ టైమ్: 2 గంటల 35 నిమిషాలు
నటీనటులు: చిరంజీవి,రామ్ చరణ్,పూజా హెగ్డే,సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, తనికెళ్ల భరణి,అజయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: తిరు
మ్యూజిక్ : మణిశర్మ
నిర్మాత: మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,కొనిదెల ప్రొడక్షన్స్
రచన,దర్శకత్వం: కొరటాల శివ
రిలీజ్ డేట్: ఏప్రిల్ 29,2022

800 ఏళ్ల క్రితం ఓ అడవిలో పాద ఘట్టం అనే స్థలం వెలుస్తుంది.అక్కడి ప్రజలు అమ్మవారే తమని కాపాడుతుందని నమ్ముతారు.ఏ కష్టం వచ్చినా అమ్మవారే వాళ్లను రక్షిస్తుంది. అప్పటినుండి నది అటు వైపు ఉన్న ధర్మస్థలి లో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుంటారు.కానీ ఆ ధర్మస్థలిలో అక్రమాలు చేస్తుంటాడు బసవ (సోనూసూద్).దీన్ని అడ్డుకునేందుకు వస్తాడు ఆచార్య (చిరంజీవి).తర్వాత ఏం జరిగింది? సిద్ద (రామ్ చరణ్) కు ధర్మస్థలి కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆచార్య ఎవరు అనేది కథ.

ఆచార్య కు ముందు నుండి అన్నీ సమస్యలే.హీరోయిన్లను మార్చడం,రీషూట్లు చేయడం,కథలో మార్పులు చేర్పులు,పోస్ట్ పోన్ లు ఇలా ఈ ప్రాజెక్ట్ కు అన్నీ అడ్డంకులే. అందువల్లే సినిమా కూడా కలగాపులగం అయింది.సినిమా స్టార్టింగ్ సీన్ నుండే నీరసం వస్తుంది.ఎక్కడా ఓ హై ఇచ్చే సీన్ రాదు.స్కీన్ మీద మెగాస్టార్ ఉన్నా కానీ ఊపు ఉండదు. కథ నడుస్తూ ఉన్నా కనెక్టివిటీ ఉండదు.నటీనటులు ఫీలయి నటిస్తున్నా.. ఆడియన్స్ కు మాత్రం ఫీల్ కలగదు. వెరసి ‘‘ఆచార్య’’ ప్రేక్షకుడి కి కనెక్ట్ కాలేదు. ఇది పూర్తిగా డైరెక్టర్ కొరటాల శివ తప్పిదమే.అలాంటి పాత చింతకాయ పచ్చడి కథను ఈ టైమ్ లో చెప్పాలనుకోవడమే రాంగ్.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు.

చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా ఎనర్జీగా నటించడానికి ట్రై చేశాడు. రామ్ చరణ్ తో కలిసి ఫైట్లు,డాన్సులు చేసేందుకు కష్టపడ్డాడు.రామ్ చరణ్ ఉన్నంత సేపు సినిమా ఎంగేంజింగ్ గా అనిపిస్తుంది.అతని లుక్, స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. చిరంజీవి,రామ్ చరణ్ కలిసి నటించిన సీన్లు ఫర్వాలేదు.పూజా హెగ్డే కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కలేదు.సోనూ సూద్ విలన్ గా రాణించాడు.మరో విలన్ గా జిషు సేన్ గుప్తా తేలిపోయాడు.అజయ్,తనికెళ్ల భరణి,వెన్నెల కిషోర్,రఘుబాబు,సత్యదేవ్ తదితరులు వాళ్ల పరిధిమేర నటించారు.

తిరు సినిమాటోగ్రఫీ బాగుంది.మణిశర్మ పాటల్లో లాహే,లాహే,నీలాంబరి,భలే బంజారా లు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు. సీన్లను ఎలివేట్ చేయలేకపోయింది. ఎడిటింగ్ బాలేదు. చాలా ల్యాగ్ ఉంది.దాని వల్ల చాలా బోర్ కొట్టింది మూవీ. డైలాగులు కూడా కొరటాల స్టైల్లో పేలలేవు. ఫైట్లు చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ ఓకే. ఇక గ్రాఫిక్స్ అయితే నాసిరకంగా ఉంది.ఉదాహరణకు సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో చిరంజీవి ఫేస్ ను గ్రాఫిక్స్ చేసి యంగ్ గా చూపించాలనుకోవడం అస్సలు బాలేదు.ఆ లుక్ లో చిరుని చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది.క్లైమాక్స్ లో కూడా సి.జి వర్క్ బాలేదు.

ఓవరాల్ గా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘‘ఆచార్య’’ పూర్తిగా నిరాశపరుస్తుంది. స్క్రీన్ మీద ఇద్దరు టాప్ హీరోలు,భారీ బడ్జెట్, పెద్ద నటీనటులు,టెక్నీషియన్లు ఎన్ని ఉన్నా లాభం లేకపోయింది. ఫస్టాఫ్ బోరింగ్ గా సాగుతుంది. సెకండాఫ్ లో రామ్ చరణ్ ఉన్నంత సేపు ఫర్వాలేదనిపిస్తుంది.ఆ తర్వాత క్లైమాక్స్ కు ప్రేక్షకులు థియేటర్లో ఉండకుండా పారిపోతారు.

బాటమ్ లైన్: అందరికీ గుణపాఠాలే