లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి

డ్యూటీలో భాగంగా డిపోకు వెళ్తున్న మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి జరిగిన ఘటన బెంగుళూరులో జరిగింది. బెంగుళూరు మెట్రో ట్రాన్స్‌పోర్టు (BMTC)కు చెందిన పీన్యా డిపోలో ఇందిరా బాయి అనే మహిళ 18 సంవత్సరాలుగా కండక్టర్‌గా పనిచేస్తుంది. ఆమె తూమకూరు జిల్లా సిరా ప్రాంతంలో భర్త, పిల్లలతో కలిసి నివసిస్తుంది. ఇందిర భర్త కూడా BMTCలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ కోసం బస్సు డిపోకు వెళ్లేందుకు గురువారం ఉదయం 5:30 నిమిషాలకు ఆమె తన ఇంటి నుంచి బస్‌స్టాప్ వైపు నడుచుకుంటూ వెళుతుంది. అప్పటికే ఆమె కోసం ఎదురుచూస్తున్న నిందితులు వెనుక నుంచి వచ్చి ఆమెపై యాసిడ్ పోశారు. యాసిడ్ పోసిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇందిరా ముఖం, మెడ, ఛాతీ మరియు భుజానికి గాయాలయ్యాయి. ఆమె అరుపులు విన్న చుట్లుపక్కల వారు వెంటనే ఆమెను స్థానిక సప్తగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందిరా ఐసీయూలో చికిత్స తీసుకుంటుంది.

దుండగుల గురించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని, యాసిడ్ దాడి చేయడం వెనుక వారి ఉద్దేశమేంటో కూడా తెలియదని నార్త్ డిసిపి శశి కుమార్ అన్నారు. ఇందిరా భాయి వాంగ్మూలం ఇంకా తీసుకోలేదని, దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. ఇందిర కుటుంబానికి తెలిసిన వారే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. ఇందిరా భాయి ఇంటికి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుల గురించి ఆరా తీస్తామని ఆయన తెలిపారు.

మరో ముఖ్య సమాచారం ఏంటంటే.. ఆరునెలల క్రితం కూడా ఇందిరా భాయిపై హత్యాయత్నం జరిగినట్లు ఆమె భర్త బాలాజీ పోలీసులకు తెలిపారు. అయితే ఆ హత్యాయత్నం గురించి అప్పుడు వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

for more news….

వచ్చి చాయ్‌‌ తాగి పోండి కానీ పైసల్​ అడగొద్దంటున్న కేసీఆర్ సారూ
కొడుకా నిన్ను పెంచలేకపోతున్నా: డిప్రెషన్​తో తల్లి ఆత్మహత్య
సెల్‌కు దగ్గరగా.. వైఫ్‌కు దూరంగా… భర్తలపై భార్యల కంప్లయింట్