
కరీంనగర్/జగిత్యాల, వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీగా సీసీఆర్బీ ఏసీపీ వి.మాధవిని నియమిస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ జీని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. జగిత్యాల డీఎస్పీగా పనిచేస్తున్న రఘుచందర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ట్రాన్స్‌ఫర్ కాగా.. రామగుండం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటస్వామికి పోస్టింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్న సీహెచ్.శ్రీనివాస్ ను రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జె.నర్సింహులును డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.