చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు : వెంకటేశ్వర్ రెడ్డి

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు  : వెంకటేశ్వర్ రెడ్డి
  • ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఆర్మూర్​ టౌన్​లోని రాజారాంనగర్​లో శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రివేళల్లో అనవసరంగా తిరదొద్దన్నారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం వంటివి చేయొద్దని చెప్పారు. గంజాయి, పేకాట, మట్కాకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పేర్కొన్నారు. అద్దె ఇళ్ల కోసం వచ్చేవారి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలన్నారు.  

సరైన పత్రాలు లేని 76 టూ వీలర్స్, 4 ఆటోలు, ఒక కారును, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు 15, రెండు ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంబంధిత డాక్యుమెంట్స్​తీసుకువచ్చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ప్రొబెషనరీ ఐపీఎస్ సాయికిరణ్, సీఐలు పి.సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, ఎస్సైలు, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.