
ఆదిలాబాద్, వెలుగు: అంగన్వాడీ టీచర్ ను వేధిస్తున్న జైనథ్ సీడీపీఓ, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ..
జైనథ్ మండలంలోని పూసాయి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రికార్డులు రాయడం లేదంటూ, డ్యూటీల విషయంలో వేధించడం వల్లే ఆమె రాజీనామా చేసిందన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నటరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునంద, నరసమ్మ, వసంత తదితరులు ఉన్నారు.