
లడాఖ్ లో హింసాత్మక ఘటనలకు సూత్రధారిగా భావిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ను లేహ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ( సెప్టెంబర్ 26) లేహ్ డీజీపీ నేతృత్వంలోని పోలీసులు సోనమ్ ను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 24న లడాఖ్ లో చెలరేగిన అల్లర్లలో నలుగురి మృతి, వందలాది మందిగాయాలపాలయిన ఘటనకు పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ కారణమని పోలీసులు ఆరోపించారు.
నిన్న వాంగు చుక్ కు చెందిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL) ఎన్జీవో సంస్థ లైసెన్స్ రద్దు చేసింది ప్రభుత్వం.. FCRA నిబంధనల దుర్వినియోగం,విదేశీ నిధుల్లో అవకతవకలు, తప్పుడు రిపోర్టు చేశారంటూ వాంగు చుక్ స్వచ్ఛంద సంస్థ లైసెన్స్ రద్దు చేసింది.
తన అరెస్ట్ పై స్పందించిన వాంగ్ చుక్.. అరెస్టతో తనకంటే ప్రభుత్వానికే ఎక్కు వనష్టం అని చెప్పారు. ప్రజాభద్రతా చట్టం కింద తనను రెండేళ్ల పాటు జైలు లో పెట్టాలని చూస్తున్నారు.. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వాంగ్ చుక్ బయటికంటే జైలు లో ఉంటేనే ప్రభుత్వానికి ఎక్కువ సమస్యలు అని అన్నారు.
లడాఖ్ లో ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలకు వాంగ్ చుక్ బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ ప్రకటించి అతని చర్య బలిపశువు వ్యూహం అంటూ నిందించింది.కేంద్ర హోంశాక ప్రకటనపై స్పందించిన వాంగ్ చుక్.. అరెస్టు కు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు.
లడాఖ్ హింస..
వాంగ్‌చుక్ నేతృత్వంలో జరిగిన లడాఖ్ రాష్ట్ర ఉద్యమం బుధవారం (సెప్టెంబర్24) లేహ్‌లో హింస, దహనం ,వీధి ఘర్షణలతో ముగిసింది. లడాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్లతో జరిగిన ప్రదర్శన లేహ్‌లోని భారతీయ బీజేపీ కార్యాలయం పై దాడులకు దారి తీసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023లోని సెక్షన్ 163 కింద శుక్రవారం (సెప్టెంబర్ 26) కూడా లేహ్‌లో 144 సెక్షన్ విధించారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న అపెక్స్ బాడీ లేహ్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. తమ నిరసన శాంతియుతంగా జరుగిందని.. సెప్టెంబర్ 24న యువతలో ఒక వర్గం అదుపు తప్పడంతో హింస చెలరేగిందని అపెక్స్ బాడీ లేహ్ చెప్పింది.
లడాఖ్ హింసకు వాంగ్ చుక్ సంబంధం లేదు .. అపెక్స్ బాడీ
లెహ్‌లో జరుగుతున్న నిరాహార దీక్షలో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాత్ర లేదని అపెక్స్ బాడీ లేహ్ తెలిపింది.. కేంద్రం ఆరోపణలను ఖండించింది. సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న ప్రజలను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడాన్ని విమర్శించింది. సోనమ్ వాంగ్‌చుక్ హింసను ప్రేరేపించారని ఆరోపించే కేంద్రం కథనాన్ని ఖండించింది.
అణచివేత, నిరంకుశ పాలన ..వాం గ్ చుక్ అరెస్ట్ పై కేజ్రీవాల్
లడాఖ్ నిరసలను బాధ్యుడిగా వాంగ్ చుక్ ను అరెస్ట్ చేయడం పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అణిచివేత, నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని కేజ్రీవాల్ అన్నారు . చరిత్రలో రావణుడి అంతం జరిగింది.. కంసుడి అంతం జరిగింది.. హిట్లర్, ముస్సోలినీ అంతం కూడా జరిగింది.. మన దేశంలో నియంతృత్వం, అణిచివేత తారాస్థాయికి చేరింది. నియంతృత్వం, అహంకారం చూపేవారి అంతం తప్పదు అని అరవింద్ కేజ్రీవాల్ చరిత్రను గుర్తు చేశారు.