ఖమ్మం సభకు వచ్చాం.. మా డబ్బులు మాకు ఇవ్వండి..

ఖమ్మం సభకు వచ్చాం.. మా డబ్బులు మాకు ఇవ్వండి..

మహబూబాబాద్ జిల్లా : గార్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖమ్మం సభకు వచ్చిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం లేదంటూ గొడవకు దిగారు. ఖమ్మం బహిరంగ సభకు తీసుకువెళ్లి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ ఆఫీస్ ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు అందోళన చేపట్టారు. సభకు వస్తే 300 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రూపాయలు ఇస్తామనడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం గార్ల బీఆర్ఎస్ ఆఫీస్ ఎదుట జనం బారులు తీరారు. మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ అందోళన చేపట్టారు. మరోవైపు పలు జిల్లాల్లో ఖమ్మం బహిరంగ సభకు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.