
ముంబై: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఇంట్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ కేసులో ఆమెను ప్రశ్నించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీబీ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, 22 ఏళ్ల అనన్య.. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖో గయే హమ్‌తోపాటు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న లైగర్ సినిమా కూడా ఉంది. లైగర్‌తో తెలుగు సినీ అభిమానులను అలరించడానికి ఆమె సిద్ధమవుతోంది.