ఏపీలో కరెంటు కోతలపై నాగబాబు సెటైర్లు

ఏపీలో కరెంటు కోతలపై నాగబాబు సెటైర్లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన ఆయన.. విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగడం లేదని విమర్శించారు. ఫ్యాన్ తిరగకపోతే వైసీపీ నేతలకూ ఇబ్బందేనని ఎద్దేవా చేశారు. ‘ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగడం లేదు. అధికార పార్టీ నేతలు ప్రజలకు ఓ కర్ర ఇస్తే.. దాంతో అయినా ఫ్యాన్ తిప్పుకుంటారు. ఎందుకంటే, ఫ్యాన్ తిరగకపోతే వైసీపీ నాయకులకూ ఇబ్బందే కదా’ అని నాగబాబు చురకలంటించారు. 

కాగా, ‘టీ టైమ్’ ఔట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ‌న‌సేన‌లో చేరార‌ని నాగ‌బాబు చెప్పారు. ‘తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీ టైమ్ ఔట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 17 రాష్ట్రాల్లో మూడు వేల టీ దుకాణాలు స్థాపించి.. 20 వేలకు పైగా మందికి ఉపాధి కల్పించారు. ఏ రాజకీయ శక్తులకు తలొగ్గకుండా జనం కోసం పనిచేస్తున్న జనసేనలో ఆయన చేరడం జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశం’ అని నాగ‌బాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

చిరు సినిమాలో పూరీ స్పెషల్ రోల్

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​

విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్