
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించారు. సీఎం కూడా అర్జున్ను శాలువాతో సత్కరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి అర్జున్ కలవడంతో ఈ భేటీకి గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ అసలు కారణం ఏంటనే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
అయితే.. సినీ నటుడు అర్జున్ రాజకీయ ప్రముఖులను కలవడం కొత్తేం కాదు. గత జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లినప్పుడు కూతురిని వెంటబెట్టుకుని మరీ వెళ్లి ప్రధానిని అర్జున్ కలిశారు. అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యకు జూన్ నెలలో ప్రేమ పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఉమాపతిని అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అర్జున్ కుటుంబంతో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నారు.
ALSO READ : Mahesh Babu: ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది..‘రాయన్’పై మహేష్ బాబు రివ్యూ