రైతులు విషం తాగితే పట్టించుకోరు.. పిజ్జా తింటే కామెంట్లా?

రైతులు విషం తాగితే పట్టించుకోరు.. పిజ్జా తింటే కామెంట్లా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ మద్దతు తెలిపారు. వీరితోపాటు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు రైతులకు తమ మద్దతు చెప్పారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. నిరసనల్లో పాల్గొన్న రైతులు పిజ్జా తినడమేంటి అంటూ కొందరు కామెంట్లు చేశారు. వీటికి దిల్జీత్ దోసాంజ్ దీటుగా రిప్లయి ఇచ్చారు. ‘శభాష్.. ఇది మిమ్మల్ని తీవ్రంగా బాధించింది కదా? రైతులు విషం తాగినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్నదాతలు పిజ్జాలు తినడం ఏంటంటూ దాన్నో పెద్ద వార్త చేస్తున్నారు’ అని దిల్జీత్ ట్వీట్ చేశాడు.