
రొటీన్ స్టోరీలు కాకుండా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే కాన్సెప్టుల్నే ఎంచుకుంటున్నాడు కార్తి. సీరియస్ సబ్జెక్ట్స్‌తో మెప్పిస్తున్నాడు. వాటిలో ‘ఖైదీ’ ఒకటి. తనని నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కించిన చిత్రమిది. పాటలు, రొమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోయినా సూపర్ డూపర్ హిట్ కొట్టిందీ మూవీ. దీనికి సీక్వెల్ రానుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే కార్తి వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇది నిజమో కాదోననే డైలమా ఏర్పడింది. ఇప్పుడది క్లియరైంది. ‘ఖైదీ’ సీక్వెల్‌కి కార్తితో పాటు టీమ్ అంతా సిద్ధంగా ఉన్నట్టు కన్‌ఫర్మ్ చేశారు నిర్మాత ఎస్.ఆర్.ప్రభు. రీసెంట్‌గా జరిగిన ఓ సోషల్ మీడియా చాట్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ తీస్తున్నాడు. కార్తి చేతిలో సర్దార్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు ఉన్నాయి. మరి వాటిని పూర్తి చేశాక సీక్వెల్‌ని పట్టాలెక్కిస్తారా లేక వీటితో పాటే దానిపైనా వర్క్ చేస్తారా అనేది చూడాలి.