రక్తపాతం లేని యుద్దంలో గెలిచాను.. నటి త్రిషకు సారీ చెప్తున్నాను

రక్తపాతం లేని యుద్దంలో గెలిచాను.. నటి త్రిషకు సారీ చెప్తున్నాను

కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ త్రిష(Trisha)పై నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Alikhan) మాట్లాడడం చేసిన కామెంట్స్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో త్రిషకు సపోర్ట్ గా.. చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, నితిన్ నిలిచారు. మన్సూర్ చేసిన కామెంట్స్ దారుణమని తప్పుబట్టారు. 

ఎవరు ఎన్ని మాటలు అన్నాకూడా.. మన్సూర్ మాత్రం తప్పుగా మాట్లాడలేదని తనను తాను సమర్ధించుకున్నారు. ఈ విషయంలో మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది జాతీయ మహిళా కమిషన్. ఈమేరకు మన్సూర్ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. నవంబర్23 ఉదయం 11 గంటలకు స్వయంగా హాజరు కావాలని మన్సూర్ అలీఖాన్‌ను కోరింది. అయితే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన మన్సూర్.. నవంబర్‌ 24న విచారణకు హాజరవుతానని చెప్పాడు.

కానీ.. తాజాగా తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు మన్సూర్.. త్రిషకు క్షమాపణలు చెప్పాడు.. ఈ మేరకు ఒక నోట్ రిలీజ్ చేసిన మన్సూర్.. ఆ నోట్ లో ఇలా రాసుకొచ్చారు.. నేను గత వారం రోజులుగా కత్తి లేకుండా యుద్దం చేశాను. రక్తపాతం లేకుండానే ఆ యుద్ధంలో నేను గెలిచాను. ఈ వివాదంలో నాకు అండగా నిలిచిన.. అందరికీ నా ధన్యవాదాలు. నన్ను, నా మాటల్ని తప్పుపట్టిన వారికి వినయపూర్వకమైన నమస్కారములు. నేను చేసిన వ్యాఖ్యలు నటి త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నా. అని రాసుకొచ్చారు మన్సూర్.