
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రతి సినిమాకీ రెండేసి రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో హీరో నాని మరో అడుగు ముందుకేశాడు. తన సినిమాకి ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్‌ను లాక్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. నజ్రియా హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌లోనూ ఫన్ జోడించారు. ఏప్రిల్ 22, 29.. మే 6, 20, 27.. జూన్ 3, 10 అంటూ ఏడు రిలీజ్ డేట్స్ ఇచ్చి, అందులో ఒక డేట్‌కి వస్తామని చెప్పారు. ‘మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా.. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్.. మెల్లగా డిసైడ్ చేస్తాం’ అంటూ ట్వీట్ చేశాడు నాని. మరి ‘సుందరం’ వీటిలో ఏ డేట్‌కి వస్తాడో చూడాలి!
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా ?
— Nani (@NameisNani) February 3, 2022
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham ?#AnteSundaraniki
#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ