శ్రీకాంత్ కామెంట్స్‌తో  నేను హర్టయ్యా..

V6 Velugu Posted on Sep 14, 2021

హీరో శ్రీకాంత్‌పై ఫైర్ అయ్యారు నటుడు నరేశ్. బయటికొచ్చి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు. తాను సాయిధరమ్ తేజ్ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని మాత్రమే చెప్పానన్నారు. అది అర్థం చేసుకోకుండా శ్రీకాంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు నరేశ్.  శ్రీకాంత్ ఇండస్ట్రీకి రావడం, హీరోగా ఎదగడం తాను చూశానన్నారు. తాను కూడా ఇండస్ట్రీలో  50ఏళ్ల నుంచి ఉన్నానన్నారు. శ్రీకాంత్ కామెంట్స్ తో  తాను హర్ట్ అయ్యానన్నారు. సాయిధరమ్ తేజ్ ది ప్రమాదమేనని ..తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చానన్నారు. బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలన్నారు. 

 

Tagged srikanth, Naresh, saitharam tej accident

Latest Videos

Subscribe Now

More News