'మహాభారత్' భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి

 'మహాభారత్' భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి

బుల్లితెర భీముడు కన్నుమూశారు. మహాభారత్ సీరియల్‌లో భీముడు పాత్ర పోషించిన  ప్రవీణ్ కుమార్ సోబ్తి కన్నుమూశారు. కార్డియర్ అరెస్ట్‌తో ఆయన చనిపోయారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 10 - 10.30 గంటల మధ్య ఆయన మృతి చెందారు. చాలా కాలంగా ఆయన ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ప్రవీణ్ కుమార్  చాలా ఇబ్బందికి గురి కావడంతో డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ప్రవీణ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏసియన్ గేమ్స్ లో ఆయన నాలుగు పథకాలు సాధించారు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 1966లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో హ్యామర్ థ్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. 1988లో బీఆర్ చోప్రా నిర్మించిన 'మహాభారత్' సీరియల్ తో ఆయన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్

సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్