
నటుడు రానా దగ్గుబాటి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ఐరన్‌హిల్ ఇండియా మేనేజింగ్ పార్టనర్ హర్ష వడ్లమూడి స్థాపించిన ఐరన్‌హిల్ హాస్పిటాలిటీ టెకీలా బ్రాండ్లోకా లోకా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
ఈ బ్రాండ్ మొదట అమెరికా మార్కెట్లోకి వస్తుంది. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతోంది. దీనిని మెక్సికోలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతామని రానా చెప్పారు. మొదటి 12 నెలల్లో వీలైనన్ని ఎక్కువ అమెరికన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు.