వీడియో జాకీ నుంచి టాలెంటెడ్ హీరోగా..

V6 Velugu Posted on Aug 29, 2021

‘Chase your dreams.. success will follow you’ ఇంగ్లీష్​లో పాపులర్​ కోట్​. ఇది తరచూ మనిషి పెట్టుకొనే గోల్స్ ను గుర్తు చేస్తుంటుంది. మలయాళ యాక్టర్​ ‘శ్రీనాథ్ భాసి’ లైఫ్​లో అచ్చం ఇలాంటి ‘ఛేజింగ్​’ ఉంటుంది. కళల వెనుక అతను చేసిన ప్రయాణం మాలీవుడ్​లో పాపులర్​ యాక్టర్​గా నిలిపింది. రేడియో జాకీ నుంచి సక్సెస్​ఫుల్​, టాలెంటెడ్​ యాక్టర్​గా పేరుతెచ్చుకున్న శ్రీనాథ్​ గురించి...

ప్రతి ఒక్కరికీ ఒక ఇంట్రెస్ట్​ ఉంటుంది. పట్టువిడువక దాన్ని డెవలప్​ చేసుకున్నప్పుడే సక్సెస్​ వస్తుంది. అలా శ్రీనాథ్​కు మ్యూజిక్​ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మ్యూజిక్​ ప్యాషన్. గిటార్​ పట్టుకొని ప్రపంచం అంతా తిరగాలని కలలు కన్నాడు. మ్యూజిక్​ మీద తనకున్న ఇంట్రెస్ట్​కు తగ్గట్టు.. తను పుట్టి పెరిగిన కొచ్చి​ సిగ్నేచర్​ స్టయిల్​​ ఫ్యాషన్​ను మెంటెయిన్​ చేసేవాడు. శ్రీనాథ్​ కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయంలో స్కూలింగ్​ పూర్తి చేశాడు. ఆ టైంలోనే అతను హిమాలయాలకు టూర్​ వెళ్లే ఛాన్స్​ వచ్చింది. స్కూల్ నుంచి వెళ్తున్న టీమ్​లో శ్రీనాథ్​ కూడా ఉన్నాడు. అప్పుడే అతని ప్రయాణం మొదలైనట్టు అనిపించింది. ప్రపంచం అంతా తిరగాలన్న కోరిక అప్పుడే మొదలైంది. స్కూల్​ ఫ్రెండ్స్​తో పదకొండు రోజుల ఆ టూర్​ ఇప్పటికీ తన కెరీర్ లో మరిచిపోలేనిది అంటాడు శ్రీనాథ్​. 

ఆ తర్వాత శ్రీనాథ్ కేరళలోని ఎంజీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశాడు. కాలేజీ లైఫ్​ మ్యూజిక్​ ఇంట్రెస్ట్​కు సెంటర్​గా మారింది. కాలేజీలో ‘క్రిమ్సన్ వుడ్’ అనే మెటల్ బ్యాండ్‌‌‌‌ టీమ్​లో పని చేసేవాడు. కాలేజీ చదువులు అయిపోయాక.. రెడ్​ ఎఫ్​ఎంలో చేరి రేడియో జాకీగా కెరీర్​ స్టార్​ చేశాడు. అదే టైంలో ‘కిరణ్’ టీవీలో వీడియో జాకీగా కూడా చేశాడు. కాలేజీ, రెడ్​ఎఫ్​ఎం ఫ్లాట్​ఫామ్​లు అతనికి మ్యూజిక్​, సాంగ్స్​ మీద మరింత ఇంట్రెస్ట్​ పెంచేలా చేశాయి. రెడ్​ ఎఫ్​ఎంలో చేస్తూనే కొన్ని సినిమాలకు ప్లే బ్యాక్​ సింగర్​గా పని చేశాడు. దీంతో పాటు కేరళలో మోడల్​గా కూడా పేరు తెచ్చుకున్నాడు శ్రీనాథ్​. 
టీవీలో వీడియో జాకీగా చేస్తున్న శ్రీనాథ్​కు 2012లో యాక్టింగ్ చాన్స్​ వచ్చింది. మోహన్​లాల్​ నటించిన ‘ప్రణయం’ అనే సినిమాకి మొదటి ఆడిషన్​లోనే ​ సెలక్ట్​ అయ్యాడు శ్రీనాథ్. ఆ సినిమా తర్వాత కామెడీ థ్రిల్లర్​ ‘హనీ బీ’ సినిమాలో నటించి యాక్టింగ్ స్కిల్స్​ను నిరూపించుకున్నాడు. ఆ సినిమా తర్వాతే శ్రీనాథ్​కు అనేక ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత 2014లో ‘బివేర్​ ఆఫ్​ డాగ్స్​’ సినిమాలో లీడ్​ రోల్​లో నటించాడు. ఈ సినిమాలో మంచి యాక్టింగ్​ స్కిల్స్​ చూపించి మాలీవుడ్​ డైరక్టర్లను తనవైపు తిప్పుకున్నాడు. 2012 నుంచి ‘ప్రణయం, అరికే ( సో క్లోజ్​), 22 ఫిమేల్ కొట్టాయం, బివేర్​ ఆఫ్​ డాగ్స్​, ఉస్తాద్​​ హోటల్’ ​ తర్వాత అనేక సినిమాల్లో సపోర్టింగ్​ రోల్స్​ చేశాడు. దుల్కర్​ సల్మాన్​, ఫహద్​ ఫాజిల్​ వంటి స్టార్​ యాక్టర్లతో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటికీ రేడీయో జాకీగా, సపోర్టింగ్​ ఆర్టిస్ట్​గా ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకున్న శ్రీనాథ్​కు హీరోగా అవకాశాలు వచ్చాయి. 2016 ఫాజిల్​ మహ్మద్​ తీసిన ‘వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్​ ఏ కల్లన్’లో హీరోగా చేశాడు శ్రీనాథ్​. ఆ టైంలో ఈ రోల్​ గురించి శ్రీనాథ్​ షాక్​ అయ్యాడు. ‘నేను హీరో అవుతున్నా అంటే నాకే నవ్వొచ్చింది’ అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ‘నేను కేవలం మ్యూజిక్​ బ్యాక్​గ్రౌండ్​తో పాపులర్​ సింగర్ అవ్వాలనుకున్నా. ప్రపంచ యాత్ర చేద్దాం అనుకున్నా. కానీ ఇలా హీరో అవుతానని అనుకోలేదు’ అంటాడు శ్రీనాథ్​. 

 ​‘ పరవ, కుంబలంగి నైట్స్​, వైరస్​, ట్రాన్స్​, కప్పెలా, హోమ్​’ సినిమాల్లో కీ రోల్స్​లో నటించాడు. తాజాగా మమ్ముటీకి సపోర్ట్​ క్యారెక్టర్​గా చేసిన ‘భీష్మ పర్వం’ సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది. అలాగే శ్రీనాథ్​ హీరోగా నటించిన ‘సుమేష్​ , రమేష్​’ సినిమా జనవరిలో పూర్తై రిలీజ్​కు రెడీగా ఉంది.  ‘ రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. అలా అని దాన్ని ఊహించుకొని ఈరోజు టైం వేస్ట్​ చేయలేను. మనకు అన్నీ తెలుసు అనుకొని రాబోయే రోజుల్ని ప్రెడిక్ట్​ చేయడం నాకు తెలియదు. ఉన్న టైంను హాయిగా గడపాలి. ప్రజెంట్​ టైం అనేది గిఫ్ట్​గా భావించాలి.సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. ఫ్యాన్స్​ కూడా మెచ్చుకుంటున్నారు. కానీ నాకు జర్నీ చేయడం అంటే మహా ఇష్టం. ఇప్పటికీ అది నెరవేరలేదు. వీలైనంత త్వరగా ప్రపంచమంతా జర్నీ చేయాలి’

Tagged life, life style, Special, story, , actor Srinath

Latest Videos

Subscribe Now

More News