తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల.. ఏ పేరు పెట్టారో తెలుసా

తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల.. ఏ పేరు పెట్టారో తెలుసా

నటుడు సుధాకర్ కోమాకుల ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోతోంది. ఆయన తండ్రి అయ్యాడు. సుధాకర్ కోమాకుల, హరిక సందెపోగు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ఈనెల 14వ తేదీన బాబు జన్మించాడని, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోస్టులో పేర్కొన్నారు. బాబుకు ‘రుద్ర కోమాకుల’ అని నామకరణం చేయడం జరిగిందన్నారు. చిన్నారి ఫొటోను కూడా రివీల్ చేశారు. ఈ పోస్టు కు సెలబ్రెటీలే కాకుండా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ దంపతులుకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. 

సుధాకర్ కోమాకుల పేరు చెబితే ఎక్కువ మంది గుర్తు పట్టకపోవచ్చు. 2002లో ‘మనసుతో’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నాగరాజు పాత్రను సుధాకర్ కోమాకుల పోషించాడు. ఈ పాత్ర చాలా పాపులర్ అయ్యింది. అనంతరం పలు ఆఫర్స్ వచ్చాయి. నువ్వు తోపురా, కుందనపు బొమ్మ లాంటి చిత్రాలలో లీడ్ రోల్స్ చేసి  ఆకట్టుకున్నాడు. పలు చిత్రాల్లో మంచి పాత్రలే

|ఇతనికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. 2020లో చిరంజీవి జన్మదినం సందర్భంగా.. తన భార్య హరికతో కలిసి గిఫ్ట్ అందించాడు. ‘ఛాలెంజ్’ సినిమాలో ‘ఇందువందన’ పాటకు దంపతులు కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియో చూసిన చిరంజీవి వారిపై ప్రశంసలు కురిపించారు. వారిద్దరి కెమిస్ట్రీ చాలా ఆకట్టుకుందని ప్రశంసించారు. హైదరాబాద్ వచ్చాక చిరంజీవిని సుధాకర్ దంపతులు కలిశారు. మెగాస్టార్ ను కలవడం తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాలుగా వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం : -

ఆ సినిమా చూస్తే కన్నీళ్లొస్తాయి


కడుపుబ్బ నవ్వుకునే సినిమా ఎఫ్ 3