Suhas: సుహాస్ బర్త్డే స్పెషల్.. మాస్‌‌‌‌, ఫ్యామిలీస్‌‌‌‌కు నచ్చేలా ‘హే భగవాన్’ గ్లింప్స్

Suhas: సుహాస్ బర్త్డే స్పెషల్.. మాస్‌‌‌‌, ఫ్యామిలీస్‌‌‌‌కు నచ్చేలా ‘హే భగవాన్’ గ్లింప్స్

సుహాస్ హీరోగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాని నాగరం హీరోయిన్‌‌‌‌గా, నరేష్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మూవీ టైటిల్ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ‘హే భగవాన్’ టైటిల్‌‌‌‌ను ప్రకటించారు. ఇక  టీజర్ సస్పెన్స్, కామెడీతో అలరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో సుహాస్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. గోపీ డెబ్యూ  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మంచి హిట్ కొడతాడనే నమ్మకం ఉంది’అని చెప్పాడు.

ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ శివాని చెప్పింది. నరేష్ మాట్లాడుతూ ‘ఈ మూవీ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. కొత్త బ్యాక్ డ్రాప్‌‌‌‌తో వస్తున్న మాస్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది.

‘సామజవరగమన’ తరహాలో ‘హే భగవాన్’అందర్నీ నవ్విస్తుంది’అని అన్నారు. ఈ సినిమాలో కామెడీతోపాటు మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా ఉంటుందని డైరెక్టర్ గోపీ చెప్పాడు. ఈ మూవీతో సుహాస్ 2.0 చూస్తారని కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత వంశీ నందిపాటి అన్నారు.