"లైగర్" ప్రమోషన్స్ లో బిజీ అయిన విజయ్ దేవరకొండ

"లైగర్" ప్రమోషన్స్ లో బిజీ అయిన విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా బిజీగా గడుపుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్.. తాజాగా ముంబైలో వీధుల్లో కనిపించాడు.  హీరోయిన్ అనన్యతో కలిసి ఇటీవల బాంబే వీధుల్లో సందడి చేసిన రౌడీ హీరో.. ఇప్పుడు పాట్నాకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఫేమస్ టీ స్టాల్లో అభిమానులతో కలిసి చాయ్ ను ఆస్వాదించాడు. పాట్నాలోని లేన్ లో ఉన్న ప్రముఖ టీ స్టాల్ గ్రాడ్యుయేట్ చైవాలీని సందర్శించిన విజయ్.... అభిమానులతో టీ తాగి, వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. క్యాజువల్ లుక్‏లో కనిపించిన విజయ్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలై.. లైగర్ పై ఉన్న హైప్ ను  మరింత పెంచింది. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా అక్డీ పక్డీ పాట కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.  మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 25న విడుదల కానుంది.